ఎమ్మేల్యే కాన్వాయ్ను అడ్డుకున్న డబుల్ లబ్దిదారులు….
నాసిరకంగా ఇండ్లు నిర్మించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
చండ్రుగొండ, (చార్మినార్ ఎక్స్ ప్రెస్)ఆగస్టు 28:
అశ్వరావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ మండల పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. బుధవారం చండ్రుగొండ ప్రధాన సెంటర్ నుండి జూలూరుపాడు రోడ్డుకు ఇరువైపులా రూ.3.12కోట్లతో నిర్మించనున్న డ్రైనేజి నిర్మాణ పనులకు ఎమ్మేల్యే ఆదినారాయణ భూమిపూజ చేశాడు. అంబేద్కర్కాలనీ వాసుల శ్మశానవాటికకు రహదారి లేక ఇబ్బందులు పడుతున్న స్థలాన్ని ఆయన పరిశీలించి, రహదారి నిర్మణానికి కృషి చేస్తానని హమి ఇచ్చాడు. అక్కడ నుండి ప్రధాన సెంటర్కు వస్తున్న ఎమ్మేల్యే ఆదినారాయణ కాన్వాయ్ను చండ్రుగొండ డబుల్బెడ్రూం ఇండ్ల లబ్దిదారులు(గిరిజనులు) అడ్డుకున్నారు. వాహనం దిగిన ఎమ్మేల్యేకు తమ కష్టాలు మొరపెట్టుకున్నారు. రెండేండ్ల క్రితం చండ్రుగొండ పంచాయితీలో నలభై డబుల్బెడ్రూం ఇండ్లను రెండేండ్ల క్రితం చండ్రుగొండ పంచాయితీలో నలభై డబుల్ బెడ్రూం ఇండ్లను రూ.2కోట్లతో ఐటిడిఏ ఆద్వర్యంలో నాసిరకంగా ఇండ్లను నిర్మించారు.ప్రారంభం నుండే ఇండ్లు కురుస్తున్నాయని, లబ్దిదారులగా మేమూ వర్షం వస్తే తడిసి,ఇంట్లోని వస్తువులన్ని దెబ్బతింటున్నాయని, అధికారులకు పిర్యాదు చేస్తే కాంట్రాక్టర్ బెదిరిస్తున్నాడని పిర్యాదు చేశారు. ఇప్పుడు కాంట్రాక్టర్ అధికారపార్టీలో మీ వెంటే ఉంటూ ఆదివాసీలమైనా మమ్ములను బెదిరిస్తున్నాడని , మా ఇండ్లను నాసిరకంగా కట్టిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. దీనికి స్పందించిన ఎమ్మేల్యే ఆదినారాయణ…. నాసిరకంగా ఇండ్ల నిర్మాణాలపై అధికారులకు తెలియజేస్తానని, అధికారులు మీ ఇండ్లను వచ్చి పరిశీలించి, ఇండ్లు కురువకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మేల్యే కాన్వాయ్ అడ్డుకున్న సమయంలో కాంగ్రెస్ లో ఉన్న వర్గాలు సదరు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఎమ్మేల్యేకు మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గోవిందరెడ్డి ప్రజాముఖంగా తెలియజేశాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా విస్తుపోయారు. కార్యక్రమంలో ఎంపిడిఓ అశోక్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.