వసతి గృహాల సలహా సంఘ సమావేశం
*అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు*
నేడు ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు జహీరాబాద్ నియోజకవర్గ వసతి గృహాల సలహా సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు అధ్యక్షత వహించినారు.జహీరాబాద్ నియోజకవర్గం నందు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల యందు బాల బాలికల కై మొత్తం 12 వసతి గృహాలు నడపబడుతున్నాయి. వీటి యందు మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రవేశం కల్పిస్తున్నారు.వసతి గృహ విద్యార్థుల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకొని, వారి బాగోగులపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఎమ్మెల్యే కోరడం జరిగింది. మరియు వసతి గృహాల యందు ఏమైనా సమస్యలు ఉంటే లిఖితపూర్వకంగా తన దృష్టికి తీసుకురావాలని కోరడం జరిగింది. మిగిలిన సీట్లను విద్యార్థులకు తెలియజేసి , తర్వాత వచ్చిన విద్యార్థులకు కూడా ప్రవేశం ఇవ్వాలని కోరడం జరిగింది.సమావేశం యందు నారాయణఖేడ్ సహాయ సంక్షేమ అధికారి శ్రీ ఎన్ శ్రీనివాస్ , జహీరాబాద్ డివిజన్ ఏబిసిడబ్ల్యూవో శ్రీమతి భాగ్యలక్ష్మి , ఎమ్మార్వోలు ఎంపీడీవోలు మరియు వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొనడం జరిగింది.