బాధిర విద్యార్థులకు రూ. 4లక్షల విలువ గల ఇయరింగ్ హెడ్స్ పంపిణి
మండల పరిధిలోని కసరాబాదా రోడ్డులోని అపూర్వ బదురుల అండ్ మానసిక రెసిడెన్షియల్ పాఠశాలలోని బధిర విద్యార్థులకు రూ. 4లక్షల విలువగల రూపాయల ఇయరింగ్ హెడ్స్ ఆశ్రయ్ ఆకృతి సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులకు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అబ్దుల్ రహీం, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, సంస్థ సభ్యులు జేఎన్, సాయి ప్రసాద్ అపూర్వ బదిరుల పాఠశాల కరస్పాండెంట్ డి మదనాచారి మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు