తూప్రాన్ లో మాల మహానాడు పాదయాత్ర కర పత్రం ఆవిష్కరణ…..
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 21 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో స్థానిక అంబేడ్కర్, జాగ్జీవన్ రామ్ ల విగ్రహాల వద్ద మాలల మహా పాదయాత్ర కర పత్రం ఆవిష్కరణ చేసిన మాల మహానాడు నాయకులు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నెత్రుత్వంలో పాద యాత్ర 25/11/2024తూప్రాన్ పట్టణానికి చేరుకుంటుంది. కావున తూప్రాన్ మండలం లోని మాలలు, మాల ఉప కులాలు పెద్దఎత్తున పాల్గొని స్వాగతం పలకాలనీ కోరినారు. ఈ కార్యక్రమం లో అంబేడ్కర్ సంగం అధ్యక్షులు పసుల నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, భైరం సత్య లింగం, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల అశోక్ కుమార్, నాయకులు, ఎర్పుల లక్ష్మణ్, కొరబోయిన ప్రవీణ్ కుమార్,దొంతి రాజేశ్వర్,పర్స ప్రభాకర్,చిట్టిమిళ్ల సత్యం పర్స పోచేందర్, చిట్టిమిళ్ల అనిల్ కుమార్, ఎర్పుల రామ్ ప్రసాద్,ఎర్పుల బాల్ రాజ్, సాయి ప్రసాద్,శాస నాగేంద్ర ప్రసాద్, చిట్టిమిళ్ల బాలు, నవీన్ కుమార్, నర్సాపురం నాగ రాజు, ప్రసాద్, స్వామి పాల్గొన్నారు.