డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మరికల్ మండల కమిటీ ఎన్నిక

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మరికల్ మండల కమిటీ ఎన్నిక

 

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మరికల్ మండల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఇందులో అధ్యక్షులుగా హన్మంతు జె పీ h ఎస్ కన్మనూర్ప్రధాన కార్యదర్శిగా చెన్నయ్యజె పి h ఎస్ మరికల్ ఉర్ధూ మీడియంఉపాధ్యక్షులుగా.కె.చైతన్య మరికల్కార్యదర్శులుగా కె.తిరుపతయ్య,PS మాదారంఎన్నుకోబడ్డారుఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర, నిర్వాహకులుగాఎన్నికల పరీశీలకులుగా ఎం.వెంకట్రాములు రాష్ట్ర కౌన్సిలర్తో పాటు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం మాట్లాడారుపెండింగ్లో ఉన్న నాలుగు డి ఏ లతో పాటు, పిఆర్సిని వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఒక సైదాంతిక పునాదితో, కామన్ స్కూల్ విద్యా విధానం కోసం, గత రెండు దశాబ్దాలకు పైగా విద్యారంగం కేంద్రంగా పోరాడుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయుల పక్షాన నిలబడుతూ పాలకులను ప్రశ్నిస్తోంది.317 జీవోతో మొదలు, ఎఫ్ ఎల్ న్ టాస్క్ ఫోర్స్ వంటి, శాస్త్రీయత లేని పాలకుల విధానాలను నిరంతరం ప్రశ్నిస్తోంది, విద్యలో శాస్త్రీయత ఉండాలని,సమానత్వం ఉండాలని, కలెక్టర్ పిల్లల నుంచి నుంచి కార్మికుని పిల్లల దాకా, ఎమ్మెల్యే పిల్లల నుంచి ముఖ్యమంత్రి పిల్లల దాకా అందరూ ఒకే పాఠశాలలో చదివేలా కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తీసుకురావాలని డి టి ఎఫ్ నిరంతరం తన గొంతును వినిపిస్తుంది

అంతేకాకుండా విద్యను వివిధ మేనేజ్మెంట్ ల కింద విభజించి, ముక్కలు చెక్కలు చేయకుండా ఒకే మేనేజ్మెంట్ కింద విద్య ఉండాలని, దానిని ప్రభుత్వమే అందించాలని, ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య విధిగా అందాలనే సామాజిక లక్ష్యాన్ని సాధించక్రమంలో డి టి ఎఫ్ ముందుకే నడుస్తుంది. అంతేకాకుండా సమాజాన్ని వెనక్కి నడిపించే నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా మొట్టమొదలు డి టి ఎఫ్ ప్రతిఘటించింది. దాని యొక్క అశాస్త్రీయతను, తిరోగమన విలువలని ఇప్పటికి ఎండగడుతూనే ఉంది

సామాజిక బాధ్యతతో, వృత్తినిబద్దతతో ఉపాధ్యాయుల పక్షాన విద్యార్థుల పక్షాన విద్యారంగ అభివృద్ధి కోసం, నిరంతరం ఉద్యమించే డి.టి.ఎఫ్ లో చేరి సంఘాన్ని బలోపేతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నూతన కమిటీ,జిల్లా ప్రధాన కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment