పంట పొలంలో గంజాయి సాగు
న్యాల్కల్లో పత్తి పొలంలో అంతర పండగ సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. న్యాల్కల్ గ్రామానికి చెందిన రైతు అశోక్ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా సాగుచేస్తున్న 158గంజాయి మొక్కలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. రైతు ద్విచక్ర వాహనంలో ఎండు గంజాయి పట్టుపడంతో బైక్ సహా గంజాయిని సీజ్ చేశారు.