ప్రత్తి రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు వ్యవసాయ అధికారి నర్మద

ప్రత్తి రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు వ్యవసాయ అధికారి నర్మద

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో సుజాతనగర్ మండలంలో రైతులు పండించిన పంటను దళారీల చేతిలో మోసపోకుండా ప్రత్తి వేసే రైతులు అందరూ ప్రత్తిని తీసాక ఆరబెట్టుకొని తేమ శాతం12 వచ్చే వరకు ఉండేలా చూసుకొని మీ ప్రత్తి ని మండలంలోని ఉన్న జిన్నింగ్ మిల్లు కు సీసీఐ ద్వారా అమ్ముకొని నష్టం జరగకుండా చూసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా రైతులు దళారులకు అమ్మి గిట్టుబాటు ధర రాక బాధపడుతున్నారని ఈ విషయం తెలుసుకొని రైతులకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నామన్నారు ప్రత్తి కొనుగోలు చేసే కొంతమంది దళారులకు అమ్మ కోవద్దని కొనుగోలుదారులకు లైసెన్స్ లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్నారని రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసుకుని లాభాల బాటలో ఉంటున్నారని అందుకే ప్రతి ఒక్క రైతు ప్రత్తి ని నేరుగా మండలంలోని జిన్నింగు మిల్లు సిసిఐ కేంద్రం ద్వారా అమ్ముకోవాలని ట్రేడర్స్ కి అమ్మడం వల్ల రైతుకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం జరుగుతుంది అన్నారు రైతులు ప్రత్తిని ఆరబెట్టుకొని 12 శాతం వచ్చాకే అమ్ముకోవాలని రైతు ఇంట్లో ఉన్న ప్రత్తి తేమ శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి సంబంధించిన ఏఈఓల ని సంప్రదించాలని వారి దగ్గర తేమశాతం చూసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి అన్నారు సుజాతనగర్ మండలంలో ఉన్న ముగ్గురు ఏ ఈ ఓ ల దగ్గర యంత్రాలు అందుబాటులో ఉన్నాయి రైతులు ఈ సదా అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రత్తి రైతు నష్టం జరగకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version