పూర్తిస్థాయిలో కాస్మొటిక్ బిల్లులు విడుదల చేయాలి

పూర్తిస్థాయిలో కాస్మొటిక్ బిల్లులు విడుదల చేయాలి..

*సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై సమరభేరి ఎస్.ఎఫ్.ఐ.సైకిల్ యాత్ర*

*మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వము విఫలం.

ఎస్.ఎఫ్.ఐ.యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమరభేరి సైకిల్ యాత్ర 3 వ రోజు గుండాల మండలానికి చేరుకున్న సందర్భంగా స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో మాట్లాడటం జరిగింది.
ఈ సమావేశం ఎస్.ఎఫ్.ఐ మాజీ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ అధ్యక్షత న నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని ఉదేశించి జిల్లా కార్యదర్శి లావుడియా రాజు ప్రజా సంఘాల నాయకులు మదేపురం రాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా రంగ సమస్యలు పరిష్కారం కోసం సమరభేరి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమూ ఆర్భాటాలు తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు.గుండాల మండల కేంద్రంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సరియైన బస్ సౌకరం లేక ఆటోలో రావలసిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు చదులువుకు దూరం అయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కారం చేయక పోతే ఉద్యమాలు ఉదృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ నరేందర్ సాయి వినయ్ రాకేష్ ఆకాష్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment