స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

తెలంగాణరాష్ట్రముఖ్యమంత్రిఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ బతుకమ్మ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన స్వచ్ఛదనం –పచ్చదనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై మొక్కలు నాటి, జి.ఎచ్.ఎం.సి సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా అవి మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలనీలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణ, అంటువ్యాదులు అరికట్టే చర్యలు, ఇంకుడు గుంతల నిర్వహణ కొత్త ఇంకుడు గుంతల ఏర్పట్ల పై అధికారులు శ్రద్ద వహించాలన్నారు. ఇంకుడు గుంతల అవసరం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జి.ఎచ్.ఎం.సి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, ఆర్.పి లు, సమాఖ్య లీడర్లు, మహిళా సంఘాల సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment