44వ వార్డు ప్రజలకు వంట గ్యాస్ సబ్సిడీ పత్రాల అందచేశారు

44వ వార్డు ప్రజలకు వంట గ్యాస్ సబ్సిడీ పత్రాల అందచేశారు

స్థానిక 44వ వార్డులోని రేషన్ దుకాణం వద్ద సూర్యాపేట నియోజకవర్గం ఇంచార్జి, మాజీ మంత్రి వర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ పత్రాలను స్థానిక కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ అందచేశారు, ఈరోజు సందర్బంగా వారు మాట్లాడుచూ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో ప్రకటించిన ఆరు గ్యారంటీ ల అమలులో భాగంగా ప్రజా ప్రభుత్వం 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు తమకు కేటాయించిన రేషన్ దుకాణాల వద్ద పత్రాలు పొందవచ్చని తెలిపారు..ఇట్టి కార్యక్రమం లో వార్డు ఆఫీసర్ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఇస్రర్ అహ్మద్, మన్సూర్ అహ్మద్,గాలి కృష్ణ,అక్కినేపల్లి సత్యనారాయణ, కందిబండ కోటేశ్వరరావు,మిట్టపల్లి రామకృష్ణ, ఆర్ పిలు పద్మ, అంగన్వాడీ టీచర్ శ్యామల మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు…..

Join WhatsApp

Join Now

Leave a Comment