పాపయ్య పేట గ్రామ శివారు సుద్ద రేవుల చెక్ డ్యాందగ్గర తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
చెన్నారావుపేట గ్రామ శివారు తుంగ బంధం దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేయాలి అని
ఎం సి పి ఐ యు పార్టీ డిమాండ్ చేయడం జరిగింది
చెన్నారావుపేట చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 7 ప్రతినిధి
ఈరోజు స్థానిక చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామ శివారులో ఎం సి పి ఐ యు పార్టీ ఆధ్వర్యంలో సుద్ద రేవుల చెక్ డ్యాం దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి చెన్నారావుపేట మండల శివార్లలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అని ఆయా ప్రాంతాలను ఎం సి పి ఐ యు పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది అనంతరం ఎం సిపిఐ యూ చెన్నారావుపేట మండల కార్యదర్శి జన్ను రమేష్ మాట్లాడుతూ పాపయ్య పేట గ్రామ శివారులో బ్రిడ్జి నిర్మాణం లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగి సుమారు 25 సంవత్సరాలు దాటుతున్న నేటి వరకు ఉపయోగకరంగా లేకుండా యున్నది ఈ ప్రాజెక్టు ద్వారా కాలువలను ఉపయోగించి ఏ ఒక్క ఎకరం భూమి కూడా పారకుండా నిరుపయోగంగా ఈ ప్రాజెక్టును వదిలివేయడం జరిగినది అసంపూర్తిగా వదిలేసిన ఈ ప్రాజెక్టు పనులను మళ్లీ వేణు వెంటనే చేపట్టి ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని తూముల ద్వారా విడిచిపెట్టి కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు నీరును అందించాలని వారు అన్నారు ఈ ప్రాజెక్టు ఆవలి వైపున ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ పనులకు వెళ్లడానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో అవతలి వైపు ఉన్న వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు అవతలి వైపు సుమారు 2000 ఎకరాల భూమిని పాపయ్యపేట ఎల్లయ్యగూడెం 16 చింతలు బోజేరు జోజిపేట ఇలా చుట్టుపక్కల ప్రాంతాల రైతుల యొక్క భూములు వ్యవసాయం చేయాలి అంటే వాన కురిసింది అంటే వాగును దాటడానికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వ్యవసాయ పనులకు వెళ్ళవలసి వస్తుంది గతంలో ఇలా కొందరు మహిళలు ప్రాజెక్టు గట్టునుండి దాటుతున్న క్రమంలో కురుమ కులానికి చెందిన ఒక మహిళ ఆ నీటి ప్రవాహంలో పడి మరణమొందినటువంటి సంగతి ప్రభుత్వానికి విధితమే కానీ ఇలా ప్రాణాలతో చలగాటం జరుగుతుందని తెలిసి నేటి వరకు కూడా ఎలాంటి మరమ్మత్తులు చేయకపోగా రైతాంగం యొక్క కష్టాలను పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతుల కష్టాన్ని గుర్తించి తక్షణమే సుద్ద రేవుల ప్రాజెక్టుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే రకంగా గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీని ద్వారా పాపయ్య పేట రైతులు నా నా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ల పొలం దగ్గరికి వెళ్లాలి అంటే చెన్నారావుపేట నర్సంపేట ఖానాపురం మండలాల మీది నుండి దాదాపు 50 కిలోమీటర్ల వరకు తిరిగి పోవాల్సి వస్తుంది దీని ద్వారా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టైం కు పంట పొలాలను సేద్యం చేయలేక పంట నష్టం జరుగుతున్నది అదే రకంగా రైతులకు ఆర్థిక భారం కూడా అధికంగా అవుతుంది కాబట్టి సుద్ద రేవుల చెక్ డ్యాం దగ్గర బ్రిడ్జి నిర్మాణం తక్షణమే నిర్మాణం చేయాలి అని వారు ప్రభుత్వాన్ని కోరినారు . చెన్నారావుపేట శివారు తుంగబంధం దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేస్తే 15 వందల ఎకరాల రైతుల భూమి ఉంది చెన్నారావుపేట అక్కలు చెడ ముగ్ధంపురం పాత ముగ్ధంపురం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అలాగే పాత ముగ్ధంపురం శివార్లో లో లెవెల్ ఉంది ఇక్కడ కూడా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అని అన్నారు ఈ యొక్క మూడు ప్రాంతాలలో బ్రిడ్జి నిర్మాణం చేపడితే రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో యూపీఎన్ఎం నాయకులు కన్నం వెంకన్న
మండల కమిటీ సభ్యులు ముర్రి శ్రీనివాస్ మెతుకు పెళ్లి రాజిరెడ్డి ఏఐఎఫ్టిఎస్ జిల్లా కమిటీ సభ్యులు పేరుక వంశీ బానోతు వీరా సింగ్ దసురు రవి తదితరులు పాల్గొన్నారు