*పొరాటయోధుడు,పేదల ఆరాధ్యదైవం కామ్రేడ్ కెవల్ కిషన్..*
*ప్రజలు ఒక వ్యక్తిని అభిమానిస్తే, గుండెల్లో పెట్టుకుని కొలుస్తారు అనడానికి నిదర్శనమే కెవల్ కిషన్..*
*ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తి…*
*నీలం మధు ముదిరాజ్..*
పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు అన్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో స్వర్గీయ కేవల్ కిషన్ ముదిరాజ్ స్మారకర్తము ఆయన సమాధి వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించే జాతరలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్,ఎం ఎల్ సి శుభాష్ రెడ్డి,తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, కెవల్ కిషన్ కూతురు డాక్టర్ వీణ కుమారి గార్లతో కలిసి నీలం మధు పాల్గొని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు కేవల్ కిషన్ అన్నారు. మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఒక్కటి చేసి ప్రజాపోరాటాలు నిర్వహించారని తెలిపారు.దున్నేవాడికే భూమి అంటు భూ పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిపెట్టారని కొనియాడారు.అలాగే కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి హక్కుల సాధనకు కృషి చేశాడన్నారు. అలాంటి మహనీయున్ని ప్రజలు స్మరించుకుంటు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి చుట్టూ ఎడ్లబండ్లను తిప్పుతూ జాతరను చేయడం ప్రశంసనీయమని తెలిపారు. ప్రజల కోసం జీవించి ప్రాణాలర్పించిన మహనీయులని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని కొలుస్తారనడానికి నిదర్శనమే కెవల్ కిషన్ పోరాటం అన్నారు. అలాంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పుట్టి అక్షయ్, మాజీ సర్పంచ్ సత్యం,స్వరూప, సత్యనారాయణ, గోపాలకృష్ణ, శ్రీకాంత్,శివన్న, బోయిని అరుణ, HCU శివ, OU సంతోష్,దుబ్బాక భాస్కర్,జలిగారి ఎట్టయ్య, సుంకరబోయిన మహేష్, నారబోయిన శ్రీనివాస్,పిల్లుట్ల గంగాధర్, సదుల్నగర్ కృష్ణ, సత్యం, మణిదీప్,తలారి భిక్షపతి, ఉత్సవ నిర్వాహకులు, తధితరులు పాల్గొన్నారు.