ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం

ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం

– జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

– డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు

ప్రజా పాలన కళాయాత్ర సమాచార, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆద్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్ల తో సిద్ధం చేయగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. 

ప్రజా విజయోత్సవాలు 2024నవంబర్ 19 నుంచి 2024 డిసెంబర్ 07వరకు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, 13 మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరా మహిళాశక్తి, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లపై ప్రచారం చేయనున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో, ప్రతి మండలం నుంచి మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

ఇక్కడ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి వి.శ్రీధర్, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment