సీఎం తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి – నిర్మల్ జిల్లా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్
ప్రైవేటు ఉపాధ్యాయుల మనోభావాలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని
నిర్మల్ జిల్లా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. స్థానిక నిర్మల్ పట్టణంలో మీడియా సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంటర్,డిగ్రీ తప్పిన వారు,అర్హత లేని వారు ప్రైవేట్ పాఠశాలలో విద్యను బోధించడం అనే మాటలు సీఎం మాట్లాడటం చాలా బాధాకరమని ఉపాధ్యాయులు తెలిపారు. అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ నిర్వాకంతో నోటిఫికేషన్ లేక ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో చాలీచాలని జీతాలతో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నమని అన్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయులకు చాలీచాలని జీతాలు ఉన్న కానీ జ్ఞానం ఎక్కువే అని మరిచిపోవద్దు. ప్రస్తుతము ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రైవేటు బడిలో చదువుతున్న వారేనని చెప్పారు. సీఎం తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రైవేటు ఉపాధ్యాయులపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల కమిటీ సభ్యులు హరీష్, రామ్ ప్రసాద్, పండరినాథ్,శ్రీనివాస్,విజయ్,శివ ,శివును తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.