సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా
గుండాల గుండాల మండలంలోని ఆయా గ్రామాల సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను అందజేసిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పెద్దపడిశాల గ్రామానికి చెందిన ఆకుల పద్మ కు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా తన నివాసంలో చెక్కులు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తి నీ ఆదుకునే విధంగా సీఎం రిలీఫ్ చెక్కు ద్వారా ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అంటూ భరోసా ఇచ్చి ప్రతి నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్ గుండాల మండల మాజీ ఎంపీపీ ద్వాప కృష్ణారెడ్డి పెద్దపడిశాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల ఆంజనేయులు గౌడ్ ఇమ్మడి దశరథ వెంకటేశ్వర్లు పెద్దపడిశాల మాజీ ఎంపీటీసీ కొర్న నరేష్ తదితరులు పాల్గొన్నారు.