ఆశలకు కనీస వేతనం 18000 ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సిఐటియు ధర్నా

ఆశలకు కనీస వేతనం 18000 ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సిఐటియు ధర్నా

 

ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆశల కు కనీస వేతనం 18000 నిర్ణయించాలని ప్రమోషన్ ఎస్ ఐ పి ఎఫ్ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే పి ఏ వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు వినోద్ పటేల్ గార్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది

 

ఈ సందర్భంగా సిఐటియు నారాయణఖేడ్ డివిజన్ కార్యదర్శి నల్లవల్లి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాకముందు తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే ఆశ వర్కర్లకు కనీస వేతనం 18000 ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం పెంచకపోవడం దుర్మార్గమని అన్నారు గతంలో ఆశ వర్కర్ల సమస్యలపై చలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముట్టడి చేయడంతో చర్చల ద్వారా కమిషనర్ స్పందిస్తూ ఇన్సూరెన్స్ 50 లక్షలు ఇస్తామన్నా హామిని నెరవేర్చాలని మట్టి ఖర్చులు 50 వేలు మరియు ఇతర ఉద్యోగులతో పాటు సెలవులు ఇవ్వాలని టార్గెట్ రద్దు చేయాలని అన్నారు స్కూటం డబ్బాలు మొయ్యడాన్ని రద్దు చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేశారని కానీ కొన్ని పీహెచ్సీలో స్పుటం డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేయడం సరైనది కాదని అన్నారు ఈ విషయంపై ప్రతి పిఎస్సి డాక్టర్లకు మెడికల్ ఆఫీసర్లకు ప్రభుత్వం సర్కులర్ ఇవ్వాలని అన్నారు ఆశ వర్కర్లకు ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని వెయిటేజ్ మార్కులు కల్పించాలని అన్నారు ప్రసూతి సెలవులు ఇవ్వాలని ప్రతినెల 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆశలకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని పెండింగ్లో ఉన్న లెప్రసి మరియు పాల్స్ పోలియో డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉతృతం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ వివిధ మండలాల అధ్యక్షురాలు భారతి, విట్టా బాయ్,కృష్ణవేణి, రుక్మిణి,శ్యామల రేష్మ జోలి బాయ్ సుజాత జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment