ఖమ్మం వరద బాధితులకు చేతన ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం.:తుమ్మల నాగేశ్వరావు.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
భారీ వర్షాలకు వరద ప్రవాహంలో పూర్తిగా అన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఖమ్మం పట్టణంలోని గత ఆరు రోజులపాటు ఫౌండేషన్ ద్వారా ఆహార పదార్థాలు నిత్యవసర సరుకులు కూరగాయలు సుమారు 5000 వేల కుటుంబాలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి విపత్తు సమయంలో అందరూ వరద బాధితులకు అండగా నిలవాలని కోరారు. వరద బాధితులకు అండగా నిలబడి సేవలందిస్తున్న చేతన ఫౌండేషన్ సభ్యులను రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ సభ్యులు దొడ్డ సీతారామయ్య, ముత్తినేని సురేష్, చంద్రకాని నవీన్, దొడ్డపనేని కృష్ణారావు, షేక్ రషీద్ పాల్గొన్నారు.