ఖమ్మంలో వరద బాదితులకు చేతన ఫౌండేషన్ చేయూత.
-నిత్యావసర సరుకులు పంపిణీ.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
బయ్యారం మండలంలోని చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో పలు డివిజన్లో వరద బాధితులకు కూరగాయలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెనిగళ్ళ రవికుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అనేక కుటుంబాలు నిరాశ్రుయులు కావడంతో వారికి ఆపన్న హస్థం అందించి పలువురు మన్నలను పొందారు. ఖమ్మం నగరంలోని 16 ,30 ,35 డివిజన్లోని పలువురు వరద లో చిక్కుకొని నిరాశ్రయులైన 1000 మంది కుటుంబాలకు గత నాలుగు రోజులు తమ సేవల ద్వారా సహాయం అందజేసినట్లు తెలిపారు .గత మూడు రోజులుగా చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి రోజు 100 కుటుంబాలకు పులిహోర ప్యాకెట్లు, రెండవ రోజు 400 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.జిల్లా వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పిలుపుమేరకు చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెనిగళ్ల రవికుమార్ ,ఇతర సేవ సిబ్బంది ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. వరద బాధితుల కోసం ఇంకా కొన్ని రోజులు మా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన చేతన ఫౌండేషన్, సిబ్బందిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి సేవలను అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దొడ్డ సీతారామయ్య ముద్దినేని సురేష్ దొడ్డపునేని కృష్ణారావు చంద్రకాని నవీన్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.