స్వచ్ఛందనం పచ్చదనం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు: మున్సిపల్ చైర్ పర్సన్ పేరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్
నేటి నుంచి 9వ తేదీ వరకు జరిగే స్వచ్ఛద నం పచ్చదనం కార్యక్రమంతో సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రం చేయాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్* పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రారంభించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రభుత్వం పరిగణించి స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పరిశుభ్రతకు చిరునామా మహిళలని మహిళలతోనే ప్రతి ఇల్లు శుభ్రపడుతుందని అన్నారు. మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు *గుంటకండ్ల జగదీష్ రెడ్డి* ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలన్నారు. సూర్యాపేట పట్టణాన్ని సుందరమైన పరిశుభ్రమైన పచ్చని పట్టణంగా తీర్చి దిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్, కౌన్సిలర్ తాహేర్ పాషా, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఇంజనీరింగ్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎస్ ఎస్ ఆర్ ప్రసాద్, టీఎంసీ శ్వేత, మున్సిపల్ జవాన్లు మెప్మా ఆర్పీలు, ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.