చందానగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మధుకుమార్ ఉప్పుటూరి

*చార్మినార్ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి డిసెంబర్ 10*

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మధుకుమార్ ఉప్పుటూరి ఎన్నికయ్యారు ఇటీవల జరిగిన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మధుకుమార్ ఉప్పుటూరి మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కార్యవర్గం తో కలసి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అసలైన లబ్ధిదారులకు అందెల ప్రయత్నం చేస్తానని అదేవిధంగా డివిజన్ లో నిరుపేద విద్యార్ధులకు తనవంతుగా సహాయసహకారాలు అందిస్తానని అన్నారు తన గెలుపుకు సహకరించిన శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment