మానవత్వం చాటుకున్న చల్లా లక్ష్మికాంత్

  • మానవత్వం చాటుకున్న చల్లా లక్ష్మికాంత్

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సూర్యాపేట ప్రతినిధి ఆగస్ట్:3

సూర్యాపేట పట్టణంలో ప్రముఖ వ్యాపారులు చల్లా లక్ష్మికాంత్ మానవత్వంతో తనకు రోడ్డు పక్కన దొరికిన నగదు 35,000/- రూపాయలను , నగదు పోగోట్టుకున్న రాజేష్ అనే వ్యక్తి కి అందజేశారు. 

సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు ఉదయం ప్రముఖ వ్యాపారస్తులు చల్లా లక్ష్మి కాంత్, తన గుమస్తా నరేష్ తో కలిసి నల్లాల బావి రోడ్ లోని తన ఆఫీస్ కు వెళుతుండగా రోడ్డు పక్కన 35,000/- నగదు దొరికింది. నగదుతో పాటు బ్యాంక్ వోచర్ లో ఫోన్ నంబర్ వుండడంతో ఆ నంబరుకు ఫోన్ చేయగా 

వి. రాజేష్ అనే వ్యక్తి వచ్చి డబ్బు తనదేనని , బ్యాంకులో జమ చేయడానికి వెళుతుంటె దారిలో తన గుమస్తా జేబులో నుండి జారీ రోడ్డు మీద పడిపోయిందని అన్నారు. తన గుమస్తా తన వద్దకు వచ్చి డబ్బు పోయిందని ఏడుస్తూ చెప్పుతుండగా, అంత లోనే డబ్బు దొరికిందని లక్ష్మీకాంత్ ఫోన్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. తనకు దొరికిన నగదును రాజేష్ కు చల్లా లక్ష్మికాంత్ అందజేశారు. తాను పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరకడంతో రాజేష్ సంతోషం వ్యక్తం చేసి చల్లా లక్ష్మికాంత్ కు ధన్యవాదములు తెలిపారు. మానవత్వం ప్రదర్శించి తనకు దొరికిన నగదును పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసిన చల్లా లక్ష్మికాంత్ ను పలువురు ప్రముఖులు, వ్యాపారులు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment