ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు
రామగిరి మండలం లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరియు హిల్-ఫోర్ట్ హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు అంగ రంగ వైభవంగా జరిపించారు. ఎస్ ఎస్ సి – 2024 ఫలితాలలో రామగిరి మండలం లోనే 10/10 జి పి ఏ సాధించిన కృష్ణవేణి ఆణిముత్యం కొలిపాక కృష్ణ మనోహర్ కి 10,116/- నగదు బహుమతిని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులలో తయారై వచ్చారు. పాఠశాల ఆవరణలో రంగు, రంగుల ముగ్గుల వేశారు. అదే విధంగా సంక్రాంతి పండగ యొక్క విశిష్టత లో భాగంగా భోగి మంటలు వేసి, వాటి చుట్టూ పిల్లలు ఆడి పాడారు. చిన్నారి నర్సరీ పిల్లలకి భోగి పళ్ళ స్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల మాతృ మూర్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా ఇందులో సుమారు వంద మంది పాల్గోన్నారు. ఇందులోని విజేతలకు ప్రథమ బహుమతి 516రూ.లు, ద్వితీయ బహుమతి 316/-, తృతీయ బహుమతి 216/- లతో పాటు రెండు కన్సోలేషన్ బహుమతులు 116/- రూ.లు లని ముఖ్య అతిథులగా విచ్చేసిన ఆర్జీ3 జనరల్ మేనేజర్ సతీమణి, సేవా అధ్యక్షురాలు అలివేణి సుధాకర్ రావు ,ఎస్ ఓ టు జనరల్ మేనేజర్ సతీమణి గీతా రాణి, కలవచర్ల గ్రామ తాజా మాజీ సర్పంచ్, మాజీ జెడ్ పి టీ సి గంట పద్మ – వెంకట రమణ రెడ్డి , సేవా సెక్రటరీ మల్లీశ్వరి, సేవా జాయింట్ సెక్రటరీ ఉమా దేవి గారు, సేవా మెంబర్ అశ్విని చే ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ బర్ల శ్రీనివాస్, డైరెక్టర్స్ అనిల్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి మరియు ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు పాల్గోన్నారు.