శాంతియుత వాతావరణంలో నవరాత్రి
వేడుకలు జరుపుకోవాలి
నిర్దేశించిన సమయానికే విగ్రాహల నిమజ్జనం పూర్తి చేయాలి డీజే లకు అనుమతి లేదు పెడితే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ ఎస్.కె జుబేదాబేగం
సుజాతనగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 15చార్మినార్ ఎక్స్ ప్రెస్
నవరాత్రి వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు అని శాంతియుత వాతావరణంలో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని సుజాతనగర్ఎస్ఐ ఎస్కే జుబేదాబేగం అన్నారు నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదని అన్నారు. అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ నిమజ్జనం రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మండలలో డీజే యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. నిర్దేశించిన సమయానికే విగ్రాహల నిమజ్జనం పూర్తి చేయాలి గణేష్ నిమజ్జనం రోజున గణేష్ శోభయాత్ర రాత్రి 7 లోపు పూర్తి అయ్యేలా భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు