కిడ్నీ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సహాయం అందచేత.
ఏటూరునాగారం, చార్మినార్ ఎక్స్ ప్రెస్ న్యూస్.
ఏటూరునాగారం మండలం ,రామన్నగూడెం గ్రామానికి చెందిన బందెల రవి ఊపిరితిత్తుల, ముత్రాపిండాల సమస్యతో బాధపడుతూ మందులు వాడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా కిడ్నీలు, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయని డాక్టర్లు చెప్పారు. రవికి ముగ్గురు చిన్న పిల్లలు. రవి కుటుంబం కూలి చేసుకొని బ్రతికే కుటుంబం. కావున దయతో పెద్ద మనసు చేసుకొని రవి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయగలరని భార్య ముగ్గురు పిల్లలు వేడుకోగా ఏటూరునాగారం గ్రామానికి చెందిన హనుమకొండలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెందిన యువ నేతాజీ ఫౌండేషన్ కీలక సభ్యుడు గజ్జెల సుమన్ తన వాట్సాప్ ద్వారా 8,500 /- రూపాయలు దాతల సహకారంతో సేకరించడం జరిగింది.సేకరించిన మొత్తం నగదును ను హనుమకొండ లోని ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న బాధితుడి భార్యకు బుధవారం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు, కానిస్టేబుల్ బొట్టు కమలాకర్,కోలా రాజేష్ ,ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్ , అలువల పృథ్వి , ఉప్పరపల్లి రాజ్ కుమార్ , మునిగాల రాంప్రసాద్ , సృజన , జ్యోతి , భావన , బిటుకూరి యాకయ్య , పాలకుర్తి విష్ణు , ఎస్.కె ముస్తఫా ,రాచకట్ల కృష్ణ ( హైకోర్ట్ అడ్వకేట్ ),ఊరటి రవికుమార్ ,యాద రవి కుమార్ , చెలిమల్ల అశోక్ కుమార్ ,తూనం రాము, వైనాల రమేష్ , మోడెం రాజశేఖర్, నాగవెళ్ళి కార్తిక్ పాల్గొనడం జరిగింది.