*విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి*
*చార్మినార్ ఎక్స్ ప్రెస్ తుంగతుర్తి ప్రతినిధి ఆగస్టు 31*
పాఠశాల విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాలి ఉదయం 10 దాటితే సాయంత్రం 4 గంటల వరకు తుంగతుర్తి మండలానికి బస్సులు లేవు గగ్గోలు పెడుతున్న మండల ప్రజలు సూర్యాపేట డిపో నుండి తుంగతుర్తి మండలానికి మధ్యాహ్నం వేల బస్సులు నడపాలి మండల ప్రజల ఆవేదన తుంగతుర్తి మండలం నుండి పలు రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఉదయం 9 లోపే బస్సులు వేస్తున్నారని అవి కూడా పిల్లలకు సరిపోక ఆటోలపై ప్రయాణం చేస్తూ ఆటో చార్జీలు కడుతున్నామని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలు గ్రామాలలోని ప్రజలు తుంగతుర్తి నుండి సూర్యాపేటకు వెళ్లడానికి ఉదయం 10 గంటలు దాటిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల లోపు బస్సులు రావడంలేదని పలు గ్రామాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట డిపో నుండి మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బస్సులు నడిపించాలని పలు గ్రామాలలోని ప్రజలు మహిళలు ఆర్టీసీ వారిని కోరుతున్నారు మాకు సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తుంగతుర్తి నుండి అరవపల్లి వరకు ఆటోలో వెళ్తున్నామని మాకు చార్జీలు ఎక్కువ భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కావున తక్షణమే తుంగతుర్తి మండలానికి సూర్యాపేట డిపో నుండి పలు పల్లె బస్సులను వేయాలని పలు గ్రామాల మహిళలు డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల రాస్తారోకోలు ధర్నాలో తప్పవని హెచ్చరించారు.