ఘనంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలు
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు వివిధ రకాల పండ్లతో కూడిన ఫ్రూట్ బాక్స్ లను పంపిణీ చేశారు. అత్యవసర సమయంలో రోగులను ఆదుకునేలా రక్తదానం చేశారు.అనంతరం *బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ నివాసం వద్ద బాణా సంచా కాల్చి బారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు*.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే నాయకులు గండూరి ప్రకాష్ అని కొనియాడారు.పార్టీ రాష్ట్ర నాయకులుగా, సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా గండూరి ప్రవల్లిక ప్రకాష్ దంపతులు విశేష సేవలు అందించారని అన్నారు.గండూరి ప్రీతం జోనా జ్ఞాపకార్ధం పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు.నాయకులు గండూరి ప్రకాష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని పుట్టిన రోజులను జరుపుకోవాలని, ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చక్రహరి నాగరాజు, వల్దాస్ జానీ, మోత్కూరి సందీప్, టైసన్ శ్రీనివాస్,రాచకొండ కృష్ణ,ఎలుగూరి రామ్మూర్తి , నాగేశ్వరరావు, పండు, సాయి, హరీష్, జేష్, జలంధర్, అరవింద్, రాజుతదితరులు పాల్గొన్నారు.