సంగారెడ్డిలో ఘనంగా దీక్షా దివస్.. హాజరైన బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ లు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు..

సంగారెడ్డిలో ఘనంగా దీక్షా దివస్..
హాజరైన బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ లు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు…

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 29, నవంబర్

చావు నోట్లో తలపెట్టి, డిల్లి మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా చేసుకున్న శ్రీ కే.సి.ఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర పుటలలో నిలిచే గొప్ప దినం, దీక్షా దివస్ సందర్భంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో గల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమాలలో ఉమ్మడి సంగారెడ్డి జిల్లా బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే, జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు చింతా ప్రభాకర్ ,జహీరాబాద్ మానిక్ ప్రభు,ఎమ్మెల్యే , ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి తెల్లాపుర్ మున్సిపల్ కౌన్సిలర్ సోమిరెడ్డి ,వెంకటేశం గౌడ్ గారు,బాల్ రెడ్డి , శ్రీధర్ చారి గారు,పృథ్వీరాజ బి.ఆర్.ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ప్రత్యేక తెలంగాణ సాధ్యమేనా అని అందరి మనసుల్లో మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిన తరుణంలో, తెలంగాణ వచ్చుడో – కెసిఆర్ సచ్చుడో అన్న నినాదంతో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ సాధించిన చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో రాయదగిన గొప్ప సుదినం ఈ దీక్షా దివస్ అని కొనియాడారు.

తెలంగాణను నిజంగా ప్రేమించింది ప్రాణాలు ఫణంగా పెట్టి సాధించింది తెలంగాణమే ఊపిరిగా నినాదించేది కేవలం ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అన్నారు. లక్కీ ల్యాటరీ లాగా ముఖ్యమంత్రి పదవి పొందిన వారికి తెలంగాణ గొప్పతనం, తెలంగాణ ప్రజల కష్టాలు కన్నీళ్లు ఎప్పటికీ పట్టవని అన్నారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో ప్రజలు విరిగి నలిగిపోయి ఉన్నారని, మళ్లీ తమ తెలంగాణ జాతిపిత కెసిఆర్ గారు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తున్నారు, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని కార్పొరేటర్ గారు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment