ముంపు కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలి. భద్రాచలం ఏఎస్పీ అంకిత్‌ కుమార్‌ సంక్వార్‌

ముంపు కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలి.

భద్రాచలం ఏఎస్పీ అంకిత్‌ కుమార్‌ సంక్వార్‌

భద్రాచలం గోదావరి వరదల కారణంగా ముంపునకు గురయ్యే కాలనీలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఏఎస్పీ అంకిత్‌ కుమార్‌ సంక్వార్‌ తెలిపారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీ, ఆశోక్‌నగర్‌ కొత్తకాలనీలో ఆయన పర్యటించి, వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, కాలనీలోకి వరద నీరు చేరిన వెంటనే సంబంధిత అధికారులకు సమచారం అందించాలని తెలిపారు. గోదావరి వరద నీరు వేగంగా పెరుగుతుందని, కావున ఎవరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే డయల్‌ 100 కు గాని లేదా 8712682106 నంబర్‌కు కాల్‌ చేయాలని కాలనీ వాసులకు ఏఎస్పీ అవగాహన కల్పించారు. అనంతరం కరకట్ట వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్‌ తో పాటు గోదావరి స్నాన ఘట్టాలను ఆయన పరిశీలించి, గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతి వేగంగా పెరుగుతుండడంతో ఎవరినీ గోదావరి నదిలో స్నానం చేసేందుకు అనుమతించవద్దని అధికారులకు తెలిపారు. అదే విధంగా గోదావరి వరద ఉధృతిని తిలకించేందుకు ఎవరిని అనుమతించవద్దని టౌన్‌ పోలీసులను ఆయన ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment