రాష్ట్రంలో బీసీల కులగణన తక్షణమే చేపట్టాలి – బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్

రాష్ట్రంలో బీసీల కులగణన తక్షణమే చేపట్టాలి – బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్, నిర్మల్ జిల్లా న్యూస్ ప్రతినిధి, ఆగస్ట్ 31,

 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సెప్టెంబర్ నెలలోనే సమగ్ర బీసీ కులగణన జరిపించి బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామిలో భాగంగా ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చెయ్యాలని వెంటనే సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని అన్నారు. దీనితో బీసీ ప్రజాలు సామాజికంగా,రాజకీయంగా,

ఉద్యోగాల పరంగా ముందుకు దూసుకుపోతారని అన్నారు మరో వైపు నిర్మల్ జిల్లాలో చూస్తే జడ్పి సహా జిల్లాలో ఉన్న మెజార్టీ మండల అధ్యక్షులు,మున్సిపల్ చైర్మన్ లు, సర్పంచ్ లు తోపాటు నామినేటెడ్ పదవులు దక్కుతాయి అని అంతే కాకుండా నిరుద్యోగ బీసీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment