బీసీ కులగణన దేశానికి ఆదర్శం..
ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రజల కుల,ఆర్థిక, ఉపాధి,రాజకీయ స్థితిగతులపై అంచనా..
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..
దేశానికి రోల్ మోడల్ బీసీ కులగణన..
సర్వే తో బీసీ లకు సామాజిక న్యాయం..
ఆర్థిక స్థితిగతుల సేకరణతో ఉపాధి అవకాశాలు ఉద్యోగుల కల్పనకు రూట్ క్లియర్..
నీలం మధు ముదిరాజ్..
అట్టహాసంగా పటాన్చెరు మండల్ చిట్కుల్ గ్రామంలో ప్రారంభమైన కుల సర్వే కార్యక్రమం.
కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ కళాకారులచే మంత్రికి ఘన స్వాగతం.
ఆకటుకున్న డప్పు,డోలు,బోనాల కళాకారుల నృత్యాలు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే-బీసీ కులగణన దేశానికే ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ చిట్కుల్ గ్రామంలో మొదలైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ముందుగా చిట్కుల్లోని చాకలి ఐలమ్మ విగ్రహనికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ సర్వే తో కులాల వారిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రిజర్వేషన్లను పెంచడానికి బీసీ కులగణన దోహదపడుతుందన్నారు. బీసీ కులగణనతో బీసీలకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సర్వే ఆర్థిక స్థితిగతుల అంచనాతో ఆయా వర్గాల వారికి ఉపాధి ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. బ్రిటిష్ కాలంలో 1931 వ సంవత్సరంలో జరిగిన కులగణన తర్వాత దేశంలో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టామని వివరించారు. బీసీలకు అన్ని రకాల ప్రాధాన్యత పెంచే ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛాలెంజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలయ్యేలా సూచనలు ఇచ్చారని తెలిపారు. ఈ సర్వే నిర్వహణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 85 వేలకు మంది పైగా ఎమ్యునరేటర్లను నియమించామని ఒక్కొక్క ఎమ్యునరేటర్ 150 కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తారన్నారు. ఒక్కొక్క కుటుంబ సర్వే పూర్తి చేయడానికి అరగంటకు పైగా సమయం పడుతుందని తెలిపారు. ప్రజలు ఎమ్యూనరేటర్లకు పూర్తిగా సహకరించి తమ సమగ్ర వివరాలను అందించాలని కోరారు. మన కుటుంబాల ఆర్థిక స్థితిగతుల వివరాల్ని ప్రభుత్వానికి అందజేసేందుకు కష్టపడుతున్న సిబ్బందికి కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ జనగణన దేశానికే రోల్ మోడల్ అని కొనియాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో బీసీ కులాల లెక్క తేలడంతో పాటు బీసీ వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లలో అవకాశాలు పెరుగుతాయి అన్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులపై అంచనాకు వచ్చి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడానికి వీలు పడుతుందన్నారు. ముఖ్యంగా కులవృత్తుల లెక్క తేలడంతో పాటు వారికి ఆయా కులవృత్తుల్లో ప్రోత్సాహం అందించి ఆర్థిక సహాయం అందించడానికి మార్గం సులువవుతుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా బీసీ కులగణన చేపట్టి బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించే విధంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ,మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మంత్రి కొండా సురేఖ లాచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీఫీఓ శ్రీధర్ రావు,పటాన్ చెరు తహసిల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి,ఎంపీవో హరి శంకర్ గౌడ్, చిట్కుల్ ఈఓ కవితతో పాటు జిల్లా, మండల అధికారులు,కాంగ్రెస్ పార్టీ వివిధ మండల, బ్లాక్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.