వాసవిలో పోషకులకు అవగాహన సదస్సు

వాసవిలో పోషకులకు అవగాహన సదస్సు

నిర్మల్ జిల్లాకేంద్రంలోని వాసవి ప్రైమరీ పాఠశాలలో ప్రీప్రైమరీ పిల్లల తల్లిదండ్రులకు మిసెస్ డింపిల్ మెహతా ట్రైనర్, అకాడమీషియన్, పేరెంటింగ్ కోచ్ చేత అవగాహన సదస్సును వాసవి యాజమాన్యం నిర్వహించింది. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలో ఉంపిల్ మెహత గారు తగిన సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగా పెద్దలను ఎలా గౌరవించాలి, పిల్లల ప్రవర్తనను ఎలా అదుపులో ఉంచాలి. సెల్ఫోన్, లాప్టాప్ వంటి వాటికి బానిసవ్వకుండా ఎలా కాపాడుకోవాలి. చదివే సమయం మరియు ఆడుకునే సమయానికి ఎలా సమానత్వాన్ని చూపాలి. ఇంటిలో అనుకూల వాతవరణాన్ని ఎలా సృష్టించు కోవాలి పిల్లలను అర్థం చేసుకొని హద్దులు అఆక్రమించకుండ స్నేహ పూర్వకంగా వారితో తల్లిదండ్రులు మసలుకోవాలని బ్లాస్ ఫుల్ పేరెంటింగ్ గురించి కొన్ని సూచనలు పోషకులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి విద్యాసంస్థల సెక్రటరీ జగదీష్ రెడ్డి, వాసవి ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపాల్ సుహాసిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment