నైన్ జలాల్పూర్ గ్రామంలో పారిశుద్ధ్యం పైన అవగాహన
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని నాయిని జలాల్పూర్ గ్రామంలో పారిశుద్ధ్యం పై గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆరా తీశారు. వానకాలం సీజన్ కాబట్టి ప్రతిరోజు వాడుకునే నీళ్ల తొట్టిలను నీరు నిలువ ఉండే ఏ పరికరం అయినా ఇంటి ఆవరణలో నీరు నిలువ ఉండే తొట్టిలను పారపోశారు ఇంటి చుట్టూ ఉండే ప్రదేశాలలో చెత్తాచెదారం వేయకుండా చూడాలని గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఇంటి వద్దకు వస్తుందని ఇంటి యజమానులకు సూచించారు లేకపోతే వ్యాధిగ్రస్తులకు గురవుతారని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ నవనీత అంగన్వాడి టీచర్ రమాదేవి ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ మల్టీ పర్పస్ వర్కర్స్ ఎల్లం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు