మాదకద్రవ్యాలు,ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన

మాదకద్రవ్యాలు,ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.
ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్

చార్మినార్ ఎక్స్ ప్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఆగస్టు3

భద్రాచలం:పట్టణంలోని శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ రూల్స్ మరియు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాము.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ ఏస్.మధు ప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు.చాలావరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం ట్రాఫిక్ నియమాలు పాటించుట పోవడంతో జరుగుతున్నాయని తెలిపారు.చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి ముఖ్య కారణం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్లు నడిపే వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోకపోవడం వలన మరణాల సంఖ్య పెరుగుతుందని తెలిపారు.కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా హెల్మెట్ , సీటు బెల్ట్ ధరించాలని వాహనదారులను కోరారు. అలాగే చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా ఉండాలని తెలిపారు. అలాగే విద్యార్థులు మాడకద్రవ్యాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్ అంధకారంగా మారే అవకాశం ఉందని విద్యార్థులు మారకతవ్యారకు దూరంగా ఉండాలని తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో బాధ్యతయుతంగా ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులని కోరారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ రామకృష్ణ , రమేష్ కళాశాల ప్రిన్సిపాల్ హెచ్.వెంకటేశ్వరావు, ఎన్ ఎస్ ఎస్ పి ఓ ఆనంద బాబు అధ్యాపకులు సుధాకర్ రెడ్డి,G.బాలకృష్ణ, తోట, జయప్రసాద్ , మాన్సింగ్ సామాజిక కార్యకర్త కొప్పుల .మురళి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment