సూర్యాపేట జిల్లా నాలుగు నియోజకవర్గల, పట్టణల అధ్యక్షుల అవగాహన సదస్సు
బిషప్ సి. హెచ్. సల్మాన్ రాజు
బిషప్ దుర్గం ప్రభాకర్
స్థానిక జిల్లా కేంద్రం సూర్యాపేట గోపాలపురం నందు స్థానిక సంఘ కాపరి రెవ. డా.పి.జాన్ మార్క్ డబ్ల్యూ. యం. ఇ.చర్చిలో సూర్యాపేట
జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, నియోజకవర్గ మరియు పట్టణ అధ్యక్షుల ముక్యుల సదస్సు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ ఆగస్టు 15 తరువాత సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ నూతన కమిటీనీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా బిషప్ సి. హెచ్. సాల్మన్ రాజు (మన్నా చర్చ్ ) పాల్గొని ప్రసంగిస్తు ప్రస్తుతం దేశంలోనూ ప్రపంచమంతట క్రైస్తవ్యానికి విరుద్ధంగా జరుగుచున్న పరిస్థితులను మరియు స్థానికముగా మనకున్న సంఘములను తెలియని వ్యక్తులు సంఘానికి సంబంధం లేని వ్యక్తుల ద్వారా వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనుటకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ సదస్సులో అభిషేకించబడి దేవుని ద్వారా తెలుపును పొంది జిల్లా వ్యాప్తంగా ఎంతో కష్టపడి దర్శనముతో సంఘములను ఏర్పాటు చేసుకొని సేవ జరిగిస్తున్నటువంటి సంఘ సేవకులు సంఘ కాపరులు సంఘ నాయకులు ఈ కష్ట ఈ కష్ట సమయంలో సంఘవిద్రోహ శక్తుల ద్వారా వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంటూ సంఘాలను కుటుంబాలను ఏ విధంగా కాపాడుకోవాలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన అధ్యక్షులు మాట్లాడిరి ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ అధ్యక్షులు రెవ. ఇంజమూరి గబ్రీయల్, సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు రెవ. డా. వి. యెషయా, హుజూర్నగర్ పాస్టర్స్ చైర్మన్ రెవ. డా. మీసా దేవసహాయం, తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షులు బ్రదర్ మందుల బాబు రావు, రెవ. డా. మిట్టగడుపుల హాజర్య,ధరవత్ లాకు నాయక్,బ్రదర్ వి. పి. దానియేలు, పాస్టర్ మాడుగుల సుందర్ రావు, తలకప్పల దయాకర్, రాజేష్, జాన్ పాల్,బొజ్జ ప్రశాంత్, రవి కాంత్, ఉటుకూరి రాజు,మరి కొంతమంది దైవజనులు పాల్గొన్నారు