వాజపాయ్ గారి సేవలు చిరస్మరణీయం.
పేట మండల బిజెపి అధ్యక్షులు కోణం విట్టల్.
చార్మినార్ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 25 మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్.
దివంగత మాజీ ప్రధాని.భారతరత్న. అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి సేవలు చిరస్మరణీయమని పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు కోణం విట్టల్ అన్నారు. బుధవారం పెద్ద శంకరంపేట లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వాజ్ పాయ్ శతజయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్ పాయ్ సమర్థవంతంగా సుస్థిర అభివృద్ధి ధ్యేయంగా ప్రధానమంత్రిగా సేవలు అందించారని గుర్తు చేశారు.ఆయన హయాంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు. నాయకులు శ్రావణ్ కుమార్. మంగళి కృష్. బొగుడాల కృష్ణ. ఆంజనేయులు వెంకటేశం ఆయా గ్రామాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు..