భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 యధావిధిగా కొనసాగించాలి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 యధావిధిగా కొనసాగించాలి….

వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కొనసాగించాలి..

ఉదయం అంబేద్కర్ కాలనీలో , పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల బాధ్యులు ఎలమందల లక్ష్మణ్ రావు మాట్లాడుతూ దేశంలో అనేక అపరిస్కృత సమస్యలు అలానే ఉన్నాయని అంటరానితనం కుల వ్యవక్షత ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉందని దీని మీద మాట్లాడని కేంద్ర ప్రభుత్వం ఒక సున్నితమైన అంశాన్ని ఓట్లు కోసం ఎస్సీల్లో ఉన్న ఉప కులాల మధ్య చిచ్చు పెట్టడం దారుణమని ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలను గంపగుప్తగా బహుళ జాతి కంపెనీలకు ప్రపంచ బ్యాంకు అమ్మే ఈ పాలకులు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కొనసాగింపు చేయకుండా వర్గీకరణ అనే బూచి తీసుకురావడం జరిగిందని భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 341 నీ యధావిధిగా కొనసాగించాలని, వర్గీకరణ రాష్ట్ర పరిధిలోకి రాదని ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని అన్నదమ్ముల కలిసి జీవించే వ్యక్తుల మధ్య గొడవ పెట్టడం భావ్యం కాదని వారు అన్నారు అదేవిధంగా దేశంలో 1200 నుంచి 1400 ఎస్సీ ఉప కులాలు ఉన్నాయని కొన్ని కులాలు వ్యతిరేకించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెల్లదు అని మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని వర్గీకరణ రాష్ట్రపతి ద్వారానే సాధ్యమవుతుందని రానున్న రోజుల్లో ఈ వర్గీకరణ తీర్పు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహా నాడు మండల బాధ్యులు బడుగు శంకర్, తలారి నాగరాజు దాసరి బాబు బడుగు. రాములు, బడుగు గణేష్, పోతురాజు రాజారావు, రాయి. రాజా, భేటీ వంశీకృష్ణ, బడుగు గణేష్ మహిళా విభాగం నాయకురాలు బడుగు కృష్ణవేణి, బేతి నాగబాబు దాసరి రామారావు బడుగు. నాగేశ్వరరావు గ్రామ ఎస్సీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment