లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందనుండి గచ్చిబౌలి కి నిలిచిన రాకపోకలు

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 01*

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకి శేరిలింగంపల్లి తడిసి ముద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరింది. దీంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి కింద నుంచి వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. బ్రిడ్జి కిందనుంచి ఎవరూ వెళ్లకుండా.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో.. ఇరువైపుల నుంచి ఎవరినీ రానివ్వకుండ .అధికారులు ఇక చేసేదేమి లేక నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు. డ్రైనీజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే రైల్వే బ్రిడ్జి కిందలు వరద నీరు చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. బ్రిడ్జి కిందకు వరద నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment