ఏ ఆర్ హెచ్ సి రాములు కుటుంబానికి సిబ్బంది చేయూత
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ జలగం రాములు కుటుంబానికి సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఏఆర్ పోలీస్ సిబ్బంది అండగా నిలిచారు. ఈరోజు ఆయన దశదిన కర్మ సందర్బంగా ఏఆర్ పోలీసు సన్నిహితులు తమ దాతృత్వం చాటుకుని రూ. 1.40 లక్షలు రాములు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా రాములు కుటుంబానికి చేయూతలో బాగస్వాములైన ఏఆర్ పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.