చేనేత అభయహస్తం నేతన్నలకు ఎంతో మేలు జరుగుతుంది, కడారి బిక్షం.
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
168 కోట్లతో చేనేత అభయ హస్తం ద్వారా నేతన్నలకు పొదుపు ,భద్రత ,భరోసా పథకాలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడం అర్షనీయమని సూర్యాపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కడారి బిక్షం అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా చేనేత సహకార సంఘంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని చేనేత, జౌళి కార్మికులకు ఈ అభయ హస్తం పథకం ద్వారా అభివృద్ధికి భరోసా కలుగుతుందని అన్నారు. నేతన్న పొదుపు నిధి కింద 115 కోట్లు, నేతన్న భద్రతకు 9 కోట్లు, నేతన్న భరోసా కు 44 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన వెంటనే చేనేత ,జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య ర్ కు ఉత్తర్వులు జారీచేసి మా నేతన్నలకు ఇది సంక్రాంతి కానుక ఇచ్చారు అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేతన్నలకు మేము అండగా ఉన్నామని మరోసారి నిరూపించారు అని తెలిపారు.చేనేత అభయ హస్తం పొదుపునిది, భద్రత ,భరోసా మూడు పథకాలకు ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి ,మాజీ మంత్రివర్యులు రాం రెడ్డి దామోదర్ రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ,జౌళి శాఖ ఉమ్మడి జిల్లా ఏడి ద్వారక్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .అలాగే సూర్యాపేట జిల్లా చేనేత సహకార సంఘం శిథిలావస్థకు చేరుకుందని దీనిని పునర్నిర్మాణానికి మాజీ మంత్రివర్యులు రాం రెడ్డి దామోదర్ రెడ్డి సహాయ సహకారాలతో పునర్నిర్మాణానికి అవకాశం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ప్రధాన కార్యదర్శి చిలువేరు నరసింహారావు, కోశాధికారి బాల్నే మల్లయ్య, ఆ సంఘ నాయకులు నాగుల శ్రీనివాస్ , ముశం హరి , యలగందుల సాయినేత, సంగిశెట్టి ఆంజనేయులు,మోత్కూరి, మధు ముషం వెంకటనారాయణ,రుద్ర దామోదర్ , యలగందుల లక్ష్మయ్య, జెల్ల శివాజీ ,సూరపల్లి మార్కండేయ ,భీమనపల్లి వెంకటేశ్వర్లు జెల్లా సూర్యం తదితరులు పాల్గొన్నారు