*రాయనిగూడెం సువార్త చర్చ్ లో కేక్ కట్ చేసిన*
మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్ రెడ్డి
గరిడేపల్లి మండల కేంద్రలోని రాయనిగూడెం గ్రామం లో సువార్త పుల్ గాస్పల్ చర్చ్ నందు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ పండుగ లో పాల్గొన్న మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండగని అన్నారు.క్రిస్మస్ సంబరం అనేది ఒక ప్రాంతం ఒక గ్రామం ఒక మండలం ఒక దేశానికి సంబంధించింది కాదని ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకతీతంగా జరుపుకునే పండగ ఏదన్నా ఉన్నదంటే అది క్రిస్మస్ పండగ అని తెలిపారు. అలాంటి క్రీస్తు వేడుకల్లో మనం ఉండడం ఆనందదాయక అన్నారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని పాటలో చదువుకుంటామని, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన కాలం, క్రీస్తుపూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపని, ఇప్పుడు క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన కాలంలో మనం ఉండడం ఆనందదాయకం గౌరవప్రదం అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, సంఘ పెద్ద పిల్లి నాగేశ్వరావు, సత్యం, ఆశీర్వదం, వీరయ్య, ఏసురత్నం, మత్తయి, రమేష్, నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.