ఉత్తమ ఉపాధ్యాయున్నీ సన్మానించిన పూర్వ విద్యార్థులు..
చెన్నారావుపేట మండల కేంద్రం జాగృతి విద్యానికేథన్ పాఠశాలకి చెందిన ప్రధానోపాధ్యాయులు ఈగ సత్యనారాయణ ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన సందర్భంగా అదే పాఠశాల కి చెందిన 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువతో సన్మానించారు…ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన గురువుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అన్న బీరేంద్ర పులిశేరు రాజేందర్ కేంచ ప్రవీణ్ వల్ల వేణు బిముత్యం రాజు వైనాల రాజు గాదగోని రాజు రాసమల్ల సతీష్ రొడ్డ కుమారస్వామి గొట్టే రాజు బండి జగదీష్ లు సన్మానించిన వారిలో ఉన్నారు..