ప్రజలందరూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలి
యాదాద్రి భువనగిరి జిల్లా
గుండాల మండల కేంద్రంలోని గుండాల, పెద్దపడిశాల ఆయా గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి గూడ వెంకటేశం ముఖ్యఅతి పాల్గొని మాట్లాడుతూ ఈరోజు నుండి తొమ్మిదో తారీఖు వరకు జరిగే స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో గ్రామ ప్రజల భాగస్వాములై మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలని ఈ కార్యక్రమంలో అన్ని రకాల సంస్థలు అధికారులు భాగస్వాములు కావాలని కోరారు ముఖ్యంగా ఇళ్ల మధ్యన ఉండే నీటి గుంటలు పాత ఇండ్లు దోమలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు గ్రామ ప్రముఖులు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి ధనుంజయ్ పంచాయతీ కార్యదర్శి మౌనిక ఏపీవో ఇమ్మానియేల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంధం చంద్రకళ ఐసిడిఎస్ సూపర్వైజర్ షమీంబి సిఆర్పి లింగయ్య ఐసిడిఎస్ పెద్ద పడిశాల గ్రామపంచాయతీ కార్యదర్శి మునోహర్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రుణమల్ల శ్రీమతమ్మ ఫీల్ అసిస్టెంట్ బుర్ర సుజాత ఆశ వర్కర్ చెర్లపల్లి శోభ విబికే శాఖపురం రమాదేవి గ్రామ పంచాయతీ సిబ్బంది అల్లే మల్లేష్ జంపాల మహేష్ బందెల బుచ్చమ్మ గడ్డం మంజుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.