భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

మెడికల్ అధికారులతో ఎంపీడీవోలతో అత్యవసర కాన్ఫరెన్స్ నిర్వహణ

పరిశుభ్రతపై దృష్టి సాధించాలి

దోమల నివారణకు ప్రతిరోజు శానిటేషన్ పాగింగ్ తప్పకుండా చేపట్టాలి

మందుల కొరత లేకుండా చూడాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా కొల్చారం మండల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీవో కార్యాలయాన్ని పరిసరాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న 72 గంటలలో భారీ వర్షం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు. మందుల కొరత లేకుండా చూడాలన్నారు.అంటూ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైరల్ ఫీవర్, డెంగు, మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

గుంతలలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని ఆయన అన్నారు.

నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్, క్రూడ్ ఆయిల్ ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు. 

దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా,

చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

 ఇండ్లల్లో నీటి నిలువలు లేకుండా, పరిశుభ్రంగా ఉంచుకోవలాన్నారు.

ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, వాడిన టీ కప్పులు, ఇతర నీటి నిలువలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.

 వారానికి ఒక సారి నీటి పాత్రలను శుభ్రపరచి నీటిని నింపుకోవాలనీ, ఇండ్ల లో వాడే కూలర్స్, ఫ్రీజ్, ఏ సీ లలో నీరు నిల్వ లేకుండా ఎపటికప్పుడు శుభ్రపరచుకొని జాగ్రత్త పడాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో లార్వాను గుర్తించి ఇలాంటి వాటివల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకు సూచించారు.జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల

 అప్రమత్తంగా ఉండాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని, మలేరియా, డెంగీ ,టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు. 

వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని కాచి చల్లార్చిన నీటి మాత్రమే తాగాలని తెలిపారు. 

అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు. నిలువ చేసిన పదార్థాలు బయట తినుబండాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు.  

 

ఈకార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడీవో కృష్ణవేణి ఎమ్మార్వో గఫర్ మియా ఏపీ ఓ మైపాల్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ అంజయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment