విఘ్నాలన్ని తొలగిపోయి… విజయాలు సిద్ధించాలి

విఘ్నాలన్ని తొలగిపోయి… విజయాలు సిద్ధించాలి

వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరి విఘ్నాలన్నీ తొలగిపోయి విజయాలు సిద్ధించాలని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు చక్రహరి నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్ అన్నారు.జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో అటుకుల బజార్, మందుల వాడలో నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమన్ని ప్రారంభించి మాట్లాడారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవడంతో పాటు తోటి వారికి సహాయపడాలని అన్నారు.నేడు జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవంలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 36వ వార్డు అధ్యక్షులు రాచకొండ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్గూరి రామ్మూర్తి, యూత్ నాయకులు గుడిసె శేఖర్, హరీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment