ఎమ్మెల్సీ రేసులో అల్ఫోర్స్ అధినేత – జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న చైర్మన్
పట్టభద్రుల అభివృద్ధికి కృషి చేస్తానని, వారి సమస్యలకు చెక్ పెట్టిస్తానని తద్వారా వారు అభివృద్ధి చెందుతారని కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ అభివృద్ధి “అల్ఫోర్స్ వి. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాల,బార్ అసోసియేషన్, బ్రాహ్మణ సంఘం సందర్శించి వారి అభ్యర్థిత్వాన్ని తెలిపి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకే మద్దతు ఇవ్వాలని కోరారు. పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తానని,ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందుంటానని చెప్పారు.ప్రత్యేకంగా భీమా సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పన, జీతభత్యాలు తదితర విషయాల్లో ప్రాధాన్యత కల్పించి కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని విలువైన ఓటును వేయాలని సూచించారు. విద్యారంగంలో అపార అనుభవం కలిగిన వాడిగా, విద్యార్థుల సమస్యలు తెలిసిన వాడిగా, సమాజం యొక్క దశ దిశ మార్చడానికి కృషిచేసి పట్టభద్రుల సంక్షేమానికి చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థల సిబ్బంది పాల్గొని వారు చేసే కృషిని కొనియాడి ఘనంగా సన్మానించారు.