ఏఐసీసీ మైనార్టీ సెల్ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ ఘరి ని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి సెల్ చైర్మన్ మహమ్మద్ ఖాన్
ఈరోజు కొత్త ఢిల్లి లో అక్బర్ రోడ్ లొని ఏఐసీసీ కార్యాలయం లో ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ ఘరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo ముస్లిం మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో 3003 కోట్లు కేటాయించిదని చెప్పడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లుబట్టి విక్రమార్క కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇమ్రాన్ ప్రతాప్ ఘరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియూ తెలంగాణ మైనారిటీ లా అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది అందుకు ఇమ్రాన్ సానుకూలంగా స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ పేద్దపల్లి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ SK అక్బర్ అలీ జగీత్యల్ జిల్లా చైర్మన్ సిరాజ్ మన్సూర్ సైఫుల్లా ఖలీద్ శిరాజ్ అజీజ్ సలీం జఫర్ షరీఫ్ ఫయాజ్,హుస్సేన్ 15 జిల్లాల జిల్లా చైర్మన్ లు కలవడం జరిగింది