పెరిగిన ధరలకనుగుణంగా వ్యవసాయ కూలి రేట్లు పెంచాలి
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో వ్యవసాయ కూలీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆగష్టు04
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో సుజాతనగర్ మండల కేంద్రం లో సిపిఎం పార్టీ కార్యాలయం ఆదివారం జరిగిన కార్యక్రమంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రకారం వ్యవసాయ కూలి రేట్లు పెంచాలని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో వ్యవసాయ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, సంఘం మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గండమాల భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు, పెరిగిన ధరలకనుగుణంగా వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెంచాలని కోరారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూలి రేట్లు పెంచుతూ కొత్త జీవో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో వ్యవసాయ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు, భూమి లేని నిరుపేదల సమగ్రంగా సర్వే చేయాలని కోరారు, మండలంలో ఉపాధి హామీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు, సిఐటీయు జిల్లా కమిటీ సభ్యులు వీర్ల రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు, పేదలకు అండగా వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుందని ఆయన అన్నారు ,ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కాట్రాల తిరుపతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు సోలం నాగరత్నం,ఆకునూరి పద్మ, కొప్పుల సత్యావతి,పెద్దమల అనసూర్య,సట్టు శైలజ,వీర్ల రమణ, బత్తుల కళావతి తదితరులు పాల్గొన్నారు