బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్వాకం
ఫొటోలో ఉన్నవి చిత్తు కాగితాలు కాదు..ప్రభుత్వ శాఖలోని ముఖ్యమైన ఫైల్స్..ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ సంబంధించిన ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ ఫైల్స్..ఎంతో మంది ఉపాధి కొరకు పెట్టుకున్న అప్లికేషన్లు.. వీటిని జాగ్రత్తగా భద్రపరచాల్సిన ఆఫీసర్లు ఇలా గాలికొదిలేశారు.. ఇది సూర్యాపేట జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖలోని అధికారుల నిర్వాకం…గతేడాది కొత్తగా కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేసుకుని పాత కలెక్టరేట్ నుండి నూతన కలెక్టరేట్ కు షిఫ్ట్ చేశారు..అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ భద్రంగా కొత్త కలెక్టరేట్ కు తరలించారు.. కానీ బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ మాత్రం పాత కలెక్టరేట్ లోనే చెత్త కుప్పలో పడేశారు.. ఫైల్స్ లను డిజిటైలేషన్ చేశాక భద్రపరచాల్సి ఉండగా ఇలా నిర్లక్ష్యంగా అక్కడే వదిలేశారు.. బీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించిన అప్లికేషన్లు, విద్యార్థుల ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ అప్లికేషన్లు, ఆఫీసులకు సంబంధించిన కీలక పత్రాలు ఇలా నెగ్లేజెన్సీ గా పడేశారు..దీనిపై బీసీ సంక్షేమ శాఖ అధికారిణి అనసూయ వివరణ కోరగా షిఫ్ట్ చేసే సమయంలో చూసుకోలేదని, ఆ సమయంలో లీవ్ లో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు…