పోలీసు వాహనాలను తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ

పోలీసు వాహనాలను తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ

పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహింస్తూ, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించి , ప్రజల సమస్యలను చట్టపరిదిలో తీర్చాలని ఉద్దేశ్యం తో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విసేబుల్ పోలిసింగ్, ప్రోఆక్టివ్ పోలీసింగ్ కోసం బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్ మరియు రద్దీ ప్రాంతాల్లో, విసబుల్ పోలీసింగ్,హై వె పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ,ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాదితులకు తక్షణ సహాయం అందించడం కోసం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజలకు సమర్ధవంతమైన సేవలు అందించడం కోసం ఈరోజు పెట్రో కార్ ,హై వే పెట్రోలింగ్ వాహనాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్. (ఐజి) ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరెట్ పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోని పెట్రో కార్, రక్షక్ హైవే పెట్రోలింగ్ పోలీసు వాహనాల పనితీరు వాటి నిర్వహణను అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు. ఎం,టి.ఓ లు, ఐటీ కోర్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్లతో కలిసి కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో పరిశీలించారు. వాహనల పనితీరు, నిర్వహణ, ట్యాబ్స్ పనితీరు, వి ఎక్స్ ఎఫ్ సెట్ పనితీరు, జి. పి. ఎస్. పనితీరు, టూల్ కిట్స్ తనిఖీ చేసి వారు నిర్వహిస్తున్న విధుల గురించి డ్రైవర్స్ ని అడ్మిన్. అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా అడిషనల్ డిసీపీ అడ్మిన్ మాట్లాడుతూ. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు, ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారులకు, ఇతర అధికారులకు తెలియజేశారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. విధులలో ఉన్నపుడు పోలీసు యునిఫామ్ తప్పని సరిగ ధరించాలి. డ్రైవింగ్ సమయంలో ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి.ఎట్టి పరిస్థితులలో మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు. మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు. వాహనాన్ని ప్రభుత్వ విధులకు మాత్రమే వినియోగించాలి. పోలీసు వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ, టైర్లు, అద్దాలు, ఇంజిన్, మైక్, లూబ్రికెంట్లు, బ్రేకులు. జి .పి .ఎస్ .వ్యవస్థను నిరంతరం తనిఖీ చేయాలి. పెట్రో కార్ వాహనంలలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, రోప్స్, కోన్స్, క్రైమ్ ప్రొటాక్ట్ రిబ్బన్, రైట్ గేర్ కిట్ ( హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ఫ్రొటెక్టర్) లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. పెట్రోల్ వెహికల్, హైవే పెట్రోలింగ్ వెహికల్ మూమెంట్ ని ఐటీ కోర్ టీమ్ మరియు పి. సి .ఆర్. టీమ్ ఎప్పుడు గమనిస్తూ ఉంటాయని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినట్లయితే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, పి సి ఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్, శ్రీధర్, ఐటి & సి ఇన్స్పెక్టర్ రాంప్రసాద్,పెద్దపల్లి జోన్ ఎంటిఓ కన్న మధు, బెల్లంపల్లి ఎంటిఓ సంపత్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్,ఎస్ఐ రాణి, వినోద్, ఐటి కోర్ హెడ్ కాన్స్టేబుల్ రాము, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment