మండల విద్యాధికారి పై చర్యలేవి…?

మండల విద్యాధికారి పై చర్యలేవి…? –

చాత్ర యువ సంఘర్ష సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 

శీతాల్కార్ అరవింద్ మాట్లాడుతూ కుబీర్ మండల విద్యాధికారి నిర్లక్ష్యం అవినీతి కారణంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారం లోకి నెట్టబడుతోంది. ఇటీవల జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల బదీలీలలో కుబీర్ మండలంలో ఏకోపాధ్యాయ పాఠశాలలైన సౌన పార్ది కే పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు బదిలీ అయినాప్పటికీ ఆయా పాఠశాలలకు ఏ ఉపాధ్యాయులు కూడా బదిలీ పై రాకపోవడం తో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కుబీర్ మండల విద్యాధికారి చేతి వాటం చూపించి ఆ ఇద్దరు ఉపాధ్యాయుల్ని రిలీవ్ చేయడం జరిగింది.ఇందుకుగాను మండల విద్యాధికారికి పెద్ద మొత్తం లో ముడుపులు అందినట్టు సమాచారం.ఈ మండల విద్యాధికారికి ముడుపులు చెలిస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నర్థకమైన తన లాభాపేక్ష కొరకు కంచె చేను మేసిన చందంగా వ్యవహారిస్తున్న తీరు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.ఒక వైపు ప్రభుత్వం ప్రతి పేద పిల్లలు ఏవరు విద్యకు దూరం కావద్దనే ఉద్దేశం తో రాష్ట్రం లోని ప్రతి గిరిజన గూడెంలోని ప్రభుత్వ పాఠశాలను తెరిపించే ఉద్దేశం తో ఇప్పటికే 11 వేల పై చిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కి డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాల ప్రకటనకు సిద్ధమావుతున్నది. దీనికి అదనంగా మరో ఆరువేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రకటించారు. మరో వైపు కుబీర్ మండలంలో దీనికి విరుద్దంగా ఉన్న పాఠశాలల్నే ముసివేసే విదంగా మండల విద్యాధికారి వ్యవహారిస్తున్నారు.గతంలో కూడా కుబీర్ మండలం లో ఓ ఉన్నత పాఠశాలలోని విద్యార్థినిల పై లైంగిక దాడికి పాల్పడిన సదరు ఉపాధ్యాయునికి వత్తాసుపులకడమే కాకుండా లైంగిక వేధింపుల కేసులో పంచాయతీ నిర్వహించకూడదన్న కనీస ఇంగీత జ్ఞానం లేకుండా మండల విద్యాధికారే పంచాయతీ పెద్దగా వ్యవహరించిన తీరు చూస్తేనే ఈ అధికారి వ్యవహార శైలి అర్థమైతోంది. అంతేకాకుండా ఆ సదరు ఉపాధ్యాయున్ని కాపాడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల పోలీస్ అధికారితో కలిసి విద్యార్ధినుల ఇంటికి వెళ్లి భరసో కేంద్రానికి వారు రాకుండా భయ బ్రాంతులకు గురి చేసారు.ఇలా చెప్పుకుంటూ పొతే ఈయన పై ఎన్నో ఆరోపణలు ప్రతి సంవత్సరం వస్తున్నా ఈ అధికారిపై చర్యలు శూన్యం.అంతేకాకుండా భారత ప్రభుత్వం బిట్కాయిన్, ఇతర విదేశీ సంస్థలు నిర్వహించే ఆర్థిక లావాదేలితో కూడిన గొలుసు కట్టు వ్యాపారాన్ని నిషేధించింది. అలాంటి బిట్ కాయిన్ గొలుసు కట్టు వ్యాపారంలో కుబీర్ మండలంలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు తమ సన్నిహితులను సహచర ఉపాధ్యాయులను ఈ వ్యాపారం లోకి దించి పాఠశాలలను గాలికి వదిలేసి బిట్ కాయిన్ వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లి వస్తున్న మండల విద్యాధికారి కనీసం ఒక్కసారి కూడా ఆ పాఠశాలలను పర్యావేక్షించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటికైనాజిల్లా విద్యాశాఖ, జిల్లా కలెక్టర్, కుబీర్ మండల విద్యాధికారి పై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకొని బడుగు బలహీన వర్గాల విద్యార్తులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.

Join WhatsApp

Join Now

Leave a Comment